పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటిల కాంబినేషన్లో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం భీమ్లా నాయక్. ఈ చిత్రం నుంచి మరో గీతం విడుదల అయింది. త్రివిక్రమ్ ఈ గీతాన్ని రచించటం విశేషం. మాటల్లో మాత్రమే కాదు పాటలో సైతం తనదైన శైలిని ఆయన పలికించారు. లాలా భీమ్లా అడవి పులి గొడవ పడి ఒడిసి పట్టు దంచి కొట్టు కత్తి పట్టు అదరగొట్టు అంటూ సాగే ఈ పోరాట సన్నివేశాల్లో భాగంగా ఈ గీతం కనిపిస్తుంది. తమన్ స్వరాలు, అరుణ్ కౌండిన్య గాత్రం ఆవేశాన్ని రగిలిస్తే, రెండు నిమిషాల ముప్పై సెకన్లు ఉన్న ఈ పాటలో కనిపిస్తున్న దృశ్యాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. ఇక భీమ్లా నాయక్ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. ఈ చిత్రానికి స్కీన్‌ప్లే సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ అందిస్తుండగా సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర.














