
భారత్-అమెరికా దేశాల మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారైంది. ఇరు దేశాలు దీనిపై ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. భారత ఉత్పత్తులపై అమెరికా ఇటీవల సుంకాలను 18 శాతానికి తగ్గించింది. ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందంలో కీలక పాత్ర పోషించిన కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ ఇది చారిత్రక విజయంగా పేర్కొన్నారు. ఈ ఒప్పందం భారతీయ ఎగుమతిదారులకు 30 ట్రిలియన్ డాలర్ల మార్కెట్‌ను కల్పిస్తుందన్నారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం రైతుల ప్రయోజనాలను పూర్తిగా పరిరక్షిస్తుందన్నారు.















