బెల్లంకొండ గణేష్ నటిస్తున్న తాజా చిత్రం నేను స్డూడెంట్ సార్. గణేష్‌కు జోడీగా అవంతిక దస్సాని నటిస్తుంది. రాఖీ ఉప్పలపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను సతీష్ వర్మ నిర్మించాడు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, టీజర్‌లు సినిమాపై మంచి హైపే క్రియేట్ చేశాయి. కాగా మేకర్స్ తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్‌తోనే సినిమా కాన్సెప్ట్‌పై కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు చిత్రబృందం. హీరో ఎంతో ఇష్టంగా ఓ ఐఫోన్ కొనుక్కుంటాడు. దానికి బుచ్చిబాబు అని పేరు కూడా పెడుతాడు. ఫోన్ కొన్న ఆనందంలో ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీలు, వీడియోలు తీస్తుంటాడు. ఈ క్రమంలో ఆ ఫోన్‌లో అనుకోకుండా ఓ హత్యకు సంబంధించిన వీడియో రికార్డు అవుతుంది. దాంతో కమిషనర్ ఆ హత్య చేసింది హీరోనే అని కావాలని ఇరుకించడానికి ట్రై చేస్తుంటాడు. హీరో హత్య చేసింది తను కాదు అంటున్న వినిపించుకోకుండా అరెస్ట్ చేస్తాడు. ఇంతకీ హత్య చేసింది ఎవరు ఆ హత్యలో హీరోను ఇరికించడానికి కారణం ఏంటీ కమిషనర్‌కు హీరోకు మధ్య గొడవలేంటి అనే ఎన్నో ప్రశ్నలతో ట్రైలర్ ఉంది. ట్రైలర్ చూస్తుంటే ఇలాంటి కథను మనం ఎన్నో సార్లు చూసినట్లే అనిపిస్తున్నా. ఒక ఫోన్ కీలకం అవడమనేది కాస్త ఆసక్తిని రేకెత్తిస్తుంది. సముద్రఖనికి పవర్ ఫుల్ రోల్ పడ్డట్లు కనిపిస్తుంది. ఇక యాక్షన్‌ను కూడా మేకర్స్ పుష్కలంగా దట్టించినట్లు ట్రైలర్‌లో స్పష్టం అయింది.