స్వీయ దర్శకత్వంలో లక్ష్మణ్ చిన్నా హీరోగా నటిస్తున్న చిత్రం నచ్చినవాడు. కావ్య రమేష్ కథానాయిక. ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ మహిళా సాధికారత, ఆత్మగౌరవం అంశాలను చర్చిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. చక్కటి ప్రేమకథతో మెప్పిస్తుంది. కథానుగుణంగా అందరూ కొత్తవాళ్లను తీసుకున్నాం. ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులందరికి కొత్త అనుభూతిని పంచుతుంది అన్నారు. ఈ సినిమాలో తాను అను అనే అమ్మాయి పాత్రను పోషించానని, ఆత్మగౌరవంతో బ్రతకాలని తపించే యువతిగా అందరిని మెప్పిస్తుందని కథానాయిక కావ్య రమేష్ తెలిపింది.
నటి లలిత నాయక్ మాట్లాడుతూ నేను కన్నడ అమ్మాయిని, ఇది నా మొదటి సినిమా. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాత లక్ష్మణ్ చిన్నా గారికి ధన్యవాదాలు అని తెలిపారు.నటుడు ఏ.బి. అర్.పి. రెడ్డి మాట్లాడుతూ నచ్చినవాడు అద్భుతమైన సినిమా. ఆడవాళ్లు గురించి, వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి చాలా అందంగా చిత్రీకరించారు. ఇంత మంచి సినిమా తో వస్తున్నా లక్ష్మణ్ చిన్నా కి నా అభినందనలు అని తెలియజేసారు.దర్శన్ మాట్లాడుతూ నచ్చినవాడు చిత్రం లో నేను చాలా ముఖ్యమైన పాత్ర చేశాను. సినిమా చాలా బాగుంది, ఆగస్టు 18న విడుదల అవుతుంది. అందరు చూడండి అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: మెజ్జో జోసెఫ్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: లక్ష్మణ్ చిన్నా.