Namaste NRI

అమెరికా విదేశాంగ శాఖ మరో కీలక నిర్ణయం

అమెరికా విదేశాంగ శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్‌ -1బీ వంటి వివిధ రకాల నాన్‌ ఇమిగ్రేషన్‌  వీసాల జారీకి సంబంధించి వ్యక్తిగత ఇంటర్వూలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు కాన్సులార్‌ కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే అవసరమైన సందర్భాల్లో కాన్సులార్‌ అధికారి ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు కూడా అనుమతించింది. హెచ్‌ 1బీ, హెచ్‌ 3, ఎల్‌ కేటగిరీ, ఓ వీసా, పీ వీసా, క్యూ వీసాల జారీలో విషయంలో ఇది వర్తిస్తుందని పేర్కొంది. విద్యార్థులకు ఇచ్చే ఎఫ్‌, ఎమ్‌, జే వీసాల విషయంలోనూ ఇది వర్తిస్తుందని పేర్కొంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events