యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఉల్లంఘనదారుల పై ఉక్కుపాదం మోపుతోంది. యూఏఈలో ప్రవేశ, నివాస చట్టాలను ఉల్లంఘించేవారికి నిష్క్రమణ అనుమతిని పొందేందుకు నియమ, నిబంధనలను ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్‌షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్స్ సెక్యూరిటీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో తాగాజా ఐసీపీ కీలక ప్రకటన చేసింది. ఐసీపీ వెబ్‌సైట్, స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ లేదా టైపింగ్ ఆఫీసుల ద్వారా జరిమానాలు చెల్లించిన తర్వాత ఉల్లంఘనకు పాల్పడిన వ్యక్తికి ఏడు రోజుల పరిమితితో ఎగ్జిట్ పర్మిట్ జారీ చేయబడుతుంది. ఆ ఏడు రోజుల గడువులోగా దేశం విడిచిపెట్టి వెళ్లిపోవాలి.

ఇంకా రెసిడెన్సీ కార్డులు పొందని యూఏఈలో నవజాత శిశువులకు కూడా నిష్క్రమణ అనుమతిని జారీ చేయడం జరుగుతుంది. అలాగే దరఖాస్తుదారుడు విధించిన అన్ని జరిమానాలు చెల్లించడం తప్పనిసరి. దేశంలోని నవజాత శిశువుల విషయంలో వారు దానిని వడిచిపెట్టడానికి ప్రయాణ పత్రాన్ని కలిగి ఉండాలి. ఇక ఎగ్జిట్ పర్మిట్ పొందడానికి దరఖాస్తుదారు ఈ-మెయిల్ ద్వారా సైతం అనుమతి పొందే వీలు కల్పించినట్లు ఈ సందర్భంగా ఐసీపీ స్పష్టం చేసింది. ఉల్లంఘనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంబంధిత అధికారులు వెల్లడించారు. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

