
భారత్, పాకిస్థాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్త పరిస్థితిని అత్యంత నిశితంగా పరిశీలిస్తున్నామని, రెండు దేశాలు పూర్తి సంయమనం పాటించాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గెటెరస్ కోరారు. పరిస్థితి మరింత దిగజార్చే చర్యలు చేపట్టవద్దని రెండు దేశాలకు విజ్ఞప్తి చేశారు. పెద్ద సంఖ్యలో పహల్గాం ఉగ్రదాడిని తాము ఖండిస్తున్నట్లు సెక్రటరీ జనరల్‌కు చెందిన అధికార ప్రతినిధి స్టీఫెన్ దుజారిక్ తెలిపారు.
