యువ హీరో ఆకాష్ పూరి తన పేరును ఆకాష్ జగన్నాథ్‌గా మార్చుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. తన బర్త్ డే రోజే ఈ పేరు మార్పు విషయాన్ని అతడు వెల్లడించడం విశేషం. బాల నటుడిగా కెరీర్ ఆరంభించిన ఆకాష్‌పూరి, ఆ తర్వాత హీరోగా ఆంధ్రాపోరి, మోహబూబా, రొమాంటిక్, చోర్ బజార్ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం మంచి కంటెంట్ ఉన్న కథలపై దృష్టి పెడుతున్న ఆకాష్ జగన్నాథ్ త్వరలో తన తదుపరి చిత్రాల వివరాలను వెల్లడించనున్నారు.