అర్జున్ అంబటి, కిశోరి దాత్రక్ జంటగా నటిస్తున్న చిత్రం తెప్పసముద్రం. రవిశంకర్, చైతన్యరావు కీలక పాత్ర లు పోషించారు. సతీశ్ రాపోలు దర్శకుడు. నీరుకంటి మంజులా రాఘవేందర్‌గౌడ్ నిర్మాత. ప్రమోషన్‌లో భాగం గా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించి, ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్ర మానికి ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, జాతీయ బీసీ కమీషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచార్య అతిథులుగా హాజరై చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు. చిన్నపిల్లలపై జరిగే అఘాయిత్యాలే కాకుండా కొన్ని ప్రత్యేకమైన ఎలిమెంట్స్ కూడా ఈ కథలో ఉంటాయని, కంటెంట్ ఉన్న సినిమాను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని దర్శకుడు చెప్పారు. ఈ సినిమాకోసం అందరూ చాలా కష్టపడ్డార ని, అందుకే సినిమా బాగా వచ్చిందని నిర్మాత పేర్కొన్నారు. ఇంకా నటీనటులు, సాంకేతిక నిపుణులు కూడా మాట్లాడారు. ఈ నెల 19న సినిమా విడుదల కానుంది.