వరుణ్‌సందేశ్, విజయ్‌శంకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం రాచరికం. అప్సరా రాణి ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. సురేష్ లంకపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. రాచరికం ఫిబ్రవరి 1న గ్రాండ్‌గా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో మూవీ ట్రైలర్‌ను డైరెక్టర్ మారుతి లాంచ్ చేయగా, మంచి స్పందన రాబట్టుకుంటోంది. రాచకొండ ఒక అడవి లాంటి దప్పా. ఈడ బలంతో పోరాడే పులులు.. బలగంతో పోరాడే ఏనుగులు.. ఎత్తుకుపైఎత్తేసే గుంట నక్కలు.. కాసుకొని కాటేసే విషసర్పాలుంటాయి. ఆదిపత్యం కోసం జరిగే పోరులో రక్తపాతాలే తప్ప రక్త సంబంధాలుండవంటూ సాగుతున్న డైలాగ్స్‌తో మొదలైంది ట్రైలర్. సినిమా ఎలా ఉండబోతుందో ట్రైలర్‌లోని డైలాగ్స్ హింట్ ఇచ్చేస్తూ క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. అప్సర రాణి ఓ వైపు గ్లామర్ డోస్ పెంచుతూనే.. మరోవైపు యాక్టింగ్‌తో అదరగొట్టేయబోతున్నట్టు ట్రైలర్ చెబుతోంది.
ఇక వరుణ్ సందేశ్ నయా అవతార్‌లో కనిపిస్తున్నాడు. ఇది తరతరాలుగా వస్తున్న రాచకొండ రాచరికం, చూస్తా ఉండు సీఎం, పీఎం అవ్వాలంటే జైలుకెళ్లడం ఒక క్వాలిఫికేషన్ అవుతాదంటూ వచ్చే డైలాగ్స్ అంచనాలు పెంచేస్తున్నాయి. థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ మూవీలో హైపర్ ఆది, రంగస్థలం మహేష్, విజయ రామరాజు, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.