తెలంగాణ రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన నడుస్తుందని, ప్రజల పక్షాన ప్రశ్నించిన వారిని అక్రమ కేసులతో వేధిస్తున్నారని ఎన్నారై బీఆర్‌ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం ఆరోపించారు. ఈ సందర్భంగా అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుడు దిలీప్ కొణతం అక్రమ అరెస్ట్‌ని తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఇలాంటి ఎన్నో నిర్భందాలని ఎదుర్కొన్నామని ఇలాంటి బెదిరిం పులకు భయపడే ప్రసక్తే లేదన్నారు.
దిలీప్ కొణతం చేసిన నేరమేం టో పోలీసులు చెప్పాలని డిమాండ్ చేశారు. దిలీప్, వారి కుటుంబానికి మేమంతా అండగా ఉన్నామని తెలిపారు. రానున్న రోజుల్లో అరాచక కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ది చెప్తారన్నారు. ఈ అక్రమ అరెస్టును ప్రపంచవ్యాప్తంగా ఎన్నారైలు తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా అడుగడుగునా ప్రశ్నిస్తామని పేర్కొన్నారు.