అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. లాస్ వెగాస్ యూనివర్సిటీలో ఓ దుండగుడు కాల్పులకు తెలగబడ్డాడు. దీంతో ముగ్గురు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వర్సిటీకి చేరుకున్నారు. క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషంగా ఉందని చెప్పారు. వర్సిటీలో ముగ్గురు మృతదేహాలను గుర్తించాం. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం అతడు స్థానిక దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో కాల్పులకు తెగబడినట్లు అనుమానిస్తున్న వ్యక్తి కూడా ఉన్నాడు అని లాస్ వెగాస్ మెట్రోపాలిటర్ పోలీసు డిపార్ట్మెంట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.















