Namaste NRI

ఈ ఏడాది పద్మ అవార్డు గ్రహీతలు వీరే… ప్రకటించిన కేంద్రం

 కేంద్రం ప్రభుత్వం పద్మ పురస్కారాలను (2025) ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులు ప్రకటించడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ సారి మొత్తం 139 మందికి కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఇందులో ఏడుగురికి పద్మవిభూషణ్‌, 19 మందికి పద్మభూషణ్‌, 113 మందికి పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది. తెలంగాణ నుంచి ఇద్దరికి పద్మ అవార్డులు వరించాయి. దువ్వూరి నాగేశ్వర్‌రెడ్డికి (వైద్యరంగం) పద్మభూషణ్‌ అవార్డుకు ఎంపికయ్యారు. మంద కృష్ణ మాదిగ (ప్రజావ్యవహారాలు) పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేసింది.   ఏపీ నుంచి ఐదుగురు పద్మ అవార్డులకు ఎంపికయ్యారు. కళల విభాగంలో హీరో నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్‌ అవార్డును కేంద్రం ప్రకటించింది. 

పద్మ అవార్డులు వీరికే..

జోనస్‌ మాశెట్టి (వేదాంత గురువు) బ్రెజిల్‌
షేఖా ఏజే అల్‌ సబాహ్‌ (యోగా)  కువైట్‌
నరేన్‌ గురుంగ్‌  ( జానపద గాయకుడు) నేపాల్‌
హర్వీందర్‌సింగ్‌ (పారా ఒలింపియన్‌ గోల్డ్‌మెడల్‌ విన్నర్‌) హర్యానా
భీమ్‌ సింగ్‌ భవేష్‌ (సామాజిక కార్యకర్త) బిహార్‌
పీ దక్షిణా మూర్తి (డోలు విద్వాంసుడు) పుదుచ్చేరి
ఎల్‌ హంగ్‌థింగ్‌ (వ్యవసాయం) నాగాలాండ్‌
బేరు సింగ్‌ చౌహాన్‌ (జానపద గాయకుడు) మధ్యప్రదేశ్‌
హరిమన్‌ శర్మ (ఆపిల్‌ సాగుదారుడు) హిమాచల్‌ ప్రదేశ్‌
జుమ్డే యోమ్‌గామ్‌ గామ్లిన్‌  (సామాజిక కార్యకర్త) అరుణాచల్‌ ప్రదేశ్‌
విలాస్‌ దాంగ్రే  (హోమియోపతి వైద్యుడు) మహారాష్ట్ర
వెంకప్ప అంబానీ సుగటేకర్‌ (జానపద గాయకుడు) కర్ణాటక
నిర్మలా దేవి   (చేతి వృత్తులు) బిహార్‌
రాధా బహిన్‌ భట్‌ (సామాజిక కార్యకర్త) ఉత్తరాఖండ్‌
జోయ్నచరణ్ బతారీ  (థింసా కళాకారుడు) అసోం
సురేశ్‌ సోనీ  (సోషల్‌వర్కర్‌) గుజరాత్‌
పాండి రామ్‌ మాండవి కళాకారుడు (ఛత్తీస్‌గఢ్‌)
లిబియా లోబో సర్దేశాయ్‌ (స్వాతంత్య్ర సమరయోధురాలు) గోవా
గోకుల్‌ చంద్రదాస్‌  (కళలు) పశ్చిమ బెంగాల్‌
సల్లీ హోల్కర్‌  ( టెక్స్‌టైల్స్‌) మధ్యప్రదేశ్‌
మారుతీ భుజరంగ్‌రావు  (సాంస్కృతికం-విద్య) మహారాష్ట్ర
బతూల్‌ బేగమ్‌ (జానపద కళాకారురాలు) రాజస్థాన్‌
వేలు ఆసన్‌ (డప్పు వాద్యకారుడు)  తమిళనాడు
భీమవ్వ దొడ్డబాలప్ప శిల్లేక్యాతర (తోలుబొమ్మలాట) కర్ణాటక
పర్మార్‌ లావ్జీభాయ్‌ నాగ్జీభాయ్‌  (చేనేత) గుజరాత్‌
విజయలక్ష్మి దేశ్‌మానే  (వైద్యం) కర్ణాటక
చైత్రం దేవ్‌చంద్‌ పవార్‌  (పర్యావరణ పరిరక్షణ) మహారాష్ట్ర

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events