ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన 10 నగరాల జాబితాను హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ సంస్థ విడుదల చేసింది. టాప్ 10 సంపన్న నగరాల జాబితాలో మొదటి స్థానం న్యూయార్క్(అమెరికా)కు దక్కింది. రెండవ స్థానంలో టోకో(జపాన్), తృతీయ స్థానంలో ది బే ఏరియా(అమెరికా), నాలుగవ స్థానంలో లండన్(బ్రిటన్) ఉన్నాయి. ఐదవ స్థానంలో సింగపూర్, ఆరవ స్థానంలో లాస్ ఏంజెలెస్(అమెరికా), ఏడవ స్థానంలో హాంకాంగ్(చైనా అధీనంలోని ప్రత్యేక పాలనా ప్రాంతం), ఎనిమిదవ స్థానంలో బీజింగ్(చైనా) ఉన్నాయి. 9వ స్థానంలో షాంఘై(చైనా), 10వ స్థానంలో సిడ్నీ(ఆస్ట్రేలియా) ఉన్నాయి.

ఈ జాబితాలో భారతదేశానికి చెందిన ఒక్క నగరం కూడా లేకపోవడం విశేషం. అయితే, సంపద విషయానికి వస్తే ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న నగరాలలో బెంగళూరు కూడా ఉంది. 10 సంపన్న నగరాల జాబితాలో అమెరికా, చైనా దేశాలు అధిక ప్రాధాన్యం దక్కించుకున్నాయి.

