Namaste NRI

ఈ ఏడాది ఆస్కార్‌ అవార్డుల విజేతలు వీరే

ప్రపంచ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్‌ వేడుకలు లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఘనంగా జరిగాయి. 95వ ఆస్కార్ అవార్డుల వేడుకుకు దేశ, విధేశాల నుంచి సినీ తారలు హాజరయ్యారు. విభాగాల వారిగా అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్టర్‌తో మొదలైన ఆస్కార్‌ అవార్డులు  బెస్ట్‌ పిక్చర్‌ అవార్డుతో ముగిసాయి.  కాగా తాజాగా అవార్డు ప్రధానోత్సవం ముగిసింది. ఈ ఏడాది అవార్డుల సొంతం చేసుకున్న సినిమాలు, నటీనటులు, టెక్నీషియన్లు జాబితా చూద్దాం….

ఉత్తమ చిత్రం:  ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌. ఉత్తమ  దర్శకుడు: డానియల్‌ క్వాన్‌, డానియల్‌ స్కీనర్ట్‌-ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌. ఉత్తమ నటుడు: బ్రెండన్‌ ఫాసర్‌- దివేల్‌ మూవీ. ఉత్తమ నటి: మిచెల్‌ యో-ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌. ఉత్తమ సహాయ నటుడు: కే హ్యూ క్వాన్‌- ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌. ఉత్తమ సహాయ నటి:  జామీ లీ కర్టిస్‌-ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌. ఉత్తమ సినిమాటోగ్రఫి:  జేమ్స్ ఫ్రెండ్-ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్టర్న్‌ ఫ్రంట్‌. ఉత్తమ ఎడిటింగ్‌: పాల్‌ రోజర్స్‌-ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌.  ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైన్‌:  రుత్‌ కార్టర్‌- బ్లాక్‌ పాంథర్‌: వకండ ఫరెవర్‌.  ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌:  క్రిస్టియన్‌ ఎమ్‌.గోల్డ్‌బెక్‌; సెట్‌ డెకరేషన్‌:ఎర్నెస్టన్‌-ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్టర్న్‌ ఫ్రంట్‌.  ఉత్తమ ఇంటర్‌నేషన్‌ ఫీచర్‌ ఫిల్మ్‌:  ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్టర్న్‌ ఫ్రంట్‌-ఎడ్వర్డ్‌ బర్గర్‌. ఉత్తమ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌:  గిల్లెర్మో డెల్ టోరో యొక్క పినోచియో-గిల్లె్ర్మో డెల్‌ టోరో, మార్క్‌ గుస్టాఫ్సన్‌.  ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌: నవల్‌నీ- డానియల్‌ రోహర్‌, ఒడెస్సా రీ, డైనీ బాకర్‌, మిలనీ మిల్లర్‌, షేన్‌ బోరిస్‌.  ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌ది ఎలిఫెంట్‌ విస్పరెర్స్‌-కార్తికి గోన్సాల్వ్స్‌, గునీత్‌ మోంగా. ఉత్తమ యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిల్మ్‌: ది బాయ్‌, ది మోల్‌, ది ఫాక్స్‌ అండ్‌ ది హర్స్‌-చార్లీ మాకెసీ అండ్‌ మాథ్యూ ఫ్రెడ్‌.  ఉత్తమ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌: యాన్‌ ఐరిష్‌ గుడ్‌బై- టామ్‌ బర్క్‌లీ, రాస్‌ వైట్‌. ఉత్తమ మేకప్‌ అండ్‌ హేయిర్‌ స్టైలిస్ట్‌:.  అడ్రియన్‌ మోరోట్‌, జుడి చిన్‌, అన్నెమారీ బ్రాడ్‌లీ-ది వేల్‌. ఉత్తమ ఒరిజినల్‌ స్కోర్‌:వోల్కర్‌ బెర్టెల్మాన్‌-ఆల్ క్వైట్ ఆన్‌ ది వెస్టర్న్‌ ఫ్రంట్‌. ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌:  నాటు నాటు- ఎమ్‌.ఎమ్‌ కీరవాణి, చంద్రబోస్‌.   ఉత్తమ సౌండ్: మార్క్‌ వెయింగర్టెన్‌, జేమ్స్‌ హెచ్‌. మాథర్‌, ఎఐ నెల్సన్, క్రిస్‌ బర్డన్‌,మార్క్‌ టైలర్‌- టాప్‌ గన్‌: మావెరిక్‌.  ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌:  జో లెట్టెరి,రీచర్ బనేహమ్‌, ఎరిక్‌ సైన్‌డన్‌, డానియల్‌ బారెట్‌-అవతార్‌:ది వే ఆఫ్‌ వాటర్‌. ఉత్తమ రైటింగ్‌(అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే):  సారా పోల్లే-వుమెన్‌ టాకింగ్‌.  ఉత్తమ రైటింగ్(ఒరిజినల్‌ స్క్రీన్‌ ప్లే):  డానియల్ క్వాన్‌, డానియల్‌ స్కీనర్ట్‌-ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress