
ప్రపంచ బిలియనీర్, టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ అమెరికాలోని విపక్ష పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. డెమొక్రాట్లు తనను చంపాలని అనుకుంటున్నారని ఆయన తెలిపారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ (డోజ్)లో తాను చేస్తున్న విప్లవాత్మక సంస్కరణలు వారికి నచ్చడం లేదని, అలా చేసినందుకు వారు నన్ను చంపాలనుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఇటీవల ఖజానాపై ఆర్థిక భారం తగ్గించే నెపంతో ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్ పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంది. బెదిరిస్తూ ఉద్యోగులకు ఈ-మెయిల్స్ పంపడం వంటి చర్యలను డెమోక్రాట్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఒక యువకుడు డోజ్‌కు సంబంధించి మస్క్‌కు మద్దతిస్తూ ఆయనను ఉద్దేశించి ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టాడు. దీనికి మస్క్ స్పందిస్తూ డెమొక్రాట్లు తనను చంపాల నుకుంటున్నారని ఆరోపణలు చేశారు.
