Namaste NRI

వారికి ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుంది: సునీల్ రెడ్డి

డైరెక్టర్‌ పి.సునీల్‌ కుమార్‌ రెడ్డి రూపొందిస్తున్న తాజా చిత్రం కాక్రోచ్‌. అభిలాష్‌ సుంకర, ప్రేమసన్‌, నవీన్‌, తీర్థ ఇందులో ప్రధాన పాత్రధారులు. బి.బాపిరాజు, ముతుకి నాగసత్యనారాయణ నిర్మాతలు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ లో ఈ సినిమా ప్రెస్‌మీట్‌ని నిర్వహించారు.వాస్తవిక సంఘటనల తెరరూపం ఈ సినిమా అని నిర్మాత బి.బాపిరాజు తెలిపారు. అనేక కేసులు స్టడీ చేసి, పోలీసులతోపాటు సహచర జర్నలిస్టుల సహకారం తీసుకొని, నేరస్థుల నుంచి కూడా పలు విషయాలను సేకరించి, నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన వయోలెంట్‌ లవ్‌స్టోరీ ఇది. ఓ వేశ్యకు, ఓ క్రిమినల్‌కూ మధ్య నడిచే ఈ ప్రేమకథ డార్క్‌గా, ఓపెన్‌గా, బోల్డ్‌గా ఉంటుంది. కేవలం వినోదం కోసమే సినిమాలు చూసేవారికి ఈ సినిమా నచ్చకపోవచ్చు. సమాజంలోని చేదు నిజాలను చూడాలనుకునేవారికి ఈ సినిమా తప్పక నచ్చుతుంది అని దర్శకుడు సునీల్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సినిమా మార్చి 6న విడుదల కానుంది.


Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events