Namaste NRI

బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తే.. నా బట్టలిప్పేవారు

మంచు మనోజ్‌ హీరోగా నటించిన తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది బెంగాలీ భామ పాయల్‌ ఘోష్‌. ఆ తర్వాత తారక్‌ నటించిన ఊసరవెల్లిలో కీలక పాత్ర పోషించింది. ఈ రోల్‌ పాయల్‌ ఘోష్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. కానీ అవకాశాలు మాత్రం సో సోగానే వచ్చాయి. బాలీవుడ్‌లో పలు సినిమాలు చేసిన ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక గత కొంత కాలంగా ఈమె సినిమాలకు దూరంగా ఉంటుంది. అయితే పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఈ మధ్య నెట్టింట తెగ సందడి చేస్తుంది.

తాజాగా ఈ బ్యూటీ చేసిన ట్వీట్‌ బాలీవుడ్‌నాట సంచలనం రేపుతుంది. బాలీవుడ్‌లో హీరోయిన్‌లకు ప్రతిభతో పనిలేదని బట్టలు విప్పితే చాలని సెన్సేషనల్ వ్యాఖ్యలు చేసింది. దేవుడి దయవల్ల సౌత్ సినిమాల ద్వారా పరిచయం అయ్యాను. కానీ అలా కాకుండా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి ఉంటే నా బట్టలు విప్పించేవారని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా ఇక్కడ అమ్మాయిల క్రియేటివిటీ, టాలెంట్‌ కంటే శరీరాలను వాడుకుంటారు. వారికదే కావాలి అంటూ ట్వీట్‌ వేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్ మీడియాను ఊపేస్తుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events