
ప్రపంచదేశాలపై పది శాతం దిగుమతి సుంకాన్ని విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. 10 శాతం గ్లోబల్ టారిఫ్ జీవోపై సంతకం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఓవల్ ఆఫీసు నుంచి గ్లోబల్ టారిఫ్‌పై సంతకం చేయడం గర్వంగా ఉందని, అన్ని దేశాలపై పది శాతం సుంకం విధించనున్నామని, తక్షణమే ఈ నిర్ణయం అమలు లోకి వస్తుందని ట్రంప్ అన్నారు. సెక్షన్ 122 కింద గ్లోబల్ టారిఫ్ చట్టాన్ని రూపొందించనున్నట్లు ఇటీవల ట్రంప్ పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి పన్ను విధానాలన్నీ కేవలం 150 రోజులు మాత్రమే అమలులో ఉండనున్నాయి.















