పెహల్‌గామ్ ఉగ్రదాడి ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పందించారు. ఆ దాడి ఓ చెత్త పనిగా అభివర్ణించారు. రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం కొన్నేళ్లుగా జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఈ వివాదాన్ని రెండు దేశాలే పరిష్కరించుకుంటాయని చెప్పుకొచ్చారు.

పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల కోసం ట్రంప్ ఇటలీ బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్ట్‌లో భారత్-పాక్ మధ్య నెలకొన్న తాజా ఉద్రిక్త పరిస్థితులపై మాట్లాడారు. నాకు భారత్, పాకిస్థాన్ రెండు దేశాలూ చాలా దగ్గర. కశ్మీర్ విషయంలో రెండు దేశాల మధ్య చాలా ఏళ్లుగా ఘర్షణలు జరుగుతున్నాయి. ఏళ్లుగా నలుగుతున్న సరిహద్దు ఉద్రిక్తతలను ఆ రెండు దేశాలే పరిష్కరించుకుంటాయి. పెహల్‌గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి ఓ చెత్త పని. ఆ దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం విచారకరం అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
