Namaste NRI

హృదయాలను తాకే కథాంశంతో ఈ సినిమా : శ్రీనివాసరావు

హరికృష్ణ, భవ్యశ్రీ జంటగా ఓ ప్రేమకథ తెరకెక్కుతున్నది. ఆదినారాయణ పినిశెట్టి దర్శకుడు. తిరుపతి శ్రీనివాసరావు నిర్మాత. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్‌ దశలో ఉంది. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ హృదయాలను తాకే కథాంశంతో ఈ సినిమా రూపొందిస్తున్నాం. త్వరలో విడుదల తేదీని, ఆసక్తికరమైన టైటిల్‌తో ప్రకటిస్తాం అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: విజయ్‌ కందుకూరి, కెమెరా: ప్రభాకర్‌రెడ్డి, సంగీతం: గౌతమ్‌ రవిరామ్‌, నిర్మాణం: టీఎస్‌ఆర్‌ మూవీ మేకర్స్‌.

Social Share Spread Message

Latest News