Namaste NRI

ఈ చిత్రం నాన్‌స్టాప్‌గా నవ్విస్తుంది : విశ్వక్‌సేన్‌

హీరో విశ్వక్‌సేన్‌ నటించిన చిత్రం ఫంకీ. కయాదు లోహర్‌ కథానాయిక. అనుదీప్‌ కేవీ దర్శకత్వం. ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు.ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. దర్శకుడు కేవీ అనుదీప్‌ తనదైన శైలి హాస్యంతో నవ్వించారు. సినీ దర్శకుడి కోమల్‌ పాత్రలో విశ్వక్‌సేన్‌ పంచిన కామెడీ హైలైట్‌గా నిలిచింది. ఈ సందర్భంగా విశ్వక్‌సేన్‌ మాట్లాడుతూ ఫంకీ చిత్రం రెండున్నర గంటల పాటు నాన్‌స్టాప్‌గా నవ్విస్తుందని, కుటుంబ సభ్యులందరూ కలిసి ఆస్వాదించేలా ఉంటుందని చెప్పారు. ఇదొక నాన్‌స్టాప్‌ ఎంటర్‌టైనర్‌ అని, ప్రేక్షకులు ఫోన్‌ వైపు చూడాలనే ఆలోచన కూడా రాదని, ప్రతీ సన్నివేశం నవ్విస్తుందన్నారు.

జాతి రత్నాలు రేంజ్‌ వినోదం ఈ సినిమాలో కూడా ఉంటుందని, ఆద్యంతం పంచ్‌లు, వ్యంగ్యంతో మెప్పిస్తుందని నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. ప్రేక్షకుల్ని వందశాతం నవ్వించే సినిమా ఇదని దర్శకుడు అనుదీప్‌ కేవీ అన్నారు. ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి కెమెరా: సురేష్‌ సారంగం, సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, నిర్మాణం: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌, దర్శకత్వం: అనుదీప్‌ కేవీ.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events