వాసుదేవ్‌రావు, రీవాచౌదరి, ప్రీతి గోస్వామి ప్రధానపాత్రధారులుగా నటిస్తున్న సినిమా సిల్క్ శారీ. టి.నాగేందర్ దర్శకుడు. కమలేష్‌కుమార్, రాహుల్ అగర్వాల్, హరీశ్ చండక్ నిర్మాతలు. ఓంకార్‌నాథ్ శ్రీశైలం, కోటేష్ మానవ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. నటులు మురళీమోహన్, శ్రీకాంత్, శివాజీరాజా, ఉత్తేజ్ అతిథులుగా హాజరై చిత్రయూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు. ఇదొక సరికొత్త రొమాంటిక్ లవ్‌స్టోరీ అని, అన్ని వర్గాలకూ నచ్చే సినిమా అవుతుందని దర్శకుడు చెప్పారు. ఇంకా చిత్ర యూనిట్ సభ్యులందరూ మాట్లాడారు. ఈ నెల 24న సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: సనక రాజశేఖర్, సంగీతం: వరికుప్పల యాదగిరి, నిర్మాణం: చాహత్ ప్రొడక్షన్స్.