Namaste NRI

ఇది అమెరికన్‌ కంపెనీలకు.. మోయలేని భారం

హెచ్‌-1బీ వీసా దరఖాస్తు ఫీజును ట్రంప్‌ ప్రభుత్వం 1 లక్ష డాలర్లకు(రూ. 88లక్షలు) పెంచడాన్ని సవాలుచేస్తూ అమెరికా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ గురువారం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఇది చట్టవ్యతిరేక నిర్ణయమని, దీని వల్ల ప్రపంచంలోని నైపుణ్యం గల ఉద్యోగులను అమెరికా కంపెనీలు కోల్పోతాయని పిటిషన్‌లో ఆరోపించింది. వీసా ఫీజు పెంపు అమెరికా ఇమిగ్రేషన్‌, నేషనాలిటీ చట్టాన్ని ఉల్లంఘిస్తోందని, ప్రభుత్వ వాస్తవిక ప్రాసెసింగ్‌ ఖర్చులకు లోబడే ఫీజు ఉండాలి తప్ప ప్రతీకారంగా లేక ఆంక్షలు విధిస్తున్నట్లు ఉండరాదని చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ తన పిటిషన్‌లో పేర్కొంది. అధికారిక ప్రకటన ద్వారా ఫీజు పెంపు విధిస్తూ అధ్యక్షుడు ట్రంప్‌ తన కార్యనిర్వాహక అధికారాలను అతిక్రమించారని కూడా పిటిషనర్‌ వాదించారు.

హెచ్‌-1బీ వీసా ఫీజు పెంపును అమలు చేయకుండా హోంల్యాండ్‌ సెక్యూరిటీ, అమెరికా విదేశాంగ శాఖను అడ్డుకోవాలని పిటిషనర్‌ కోర్టును అభ్యర్థించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో కొత్త హెచ్‌-1బీ దరఖాస్తుల ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ అధ్యక్షుడు ట్రంప్‌ ప్రొక్లమేషన్‌పై సంతకం చేశారు. అమెరికా ఉద్యోగుల స్థానంలో తక్కువ జీతాలకు విదేశీ ఉద్యోగులను నియమించుకుని హెచ్‌-1బీ వీసా ప్రోగ్రామ్‌ను దుర్వినియోగం చేయడాన్ని అడ్డుకోవడానికే ఇమిగ్రేషన్‌ సంస్కరణలు తీసుకువచ్చినట్లు ట్రంప్‌ ప్రభుత్వం ప్రకటించింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events