వెన్నెల కిషోర్, నందితాశ్వేత, నవమి గాయక్, షకలక శంకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఓ మంచి ఘోస్ట్. శంకర్ మార్తాండ్ దర్శకుడు. ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. దర్శకుడు మాట్లాడుతూ హారర్ కామెడీ జోనర్ సినిమా ఇది. కుటుంబ సమేతంగా చూసే విధంగా ఉంటుంది. సాంకేతికంగా కూడా ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కించాం. అనూప్ రూబెన్స్ సంగీతం ప్రధానాకర్షణగా నిలుస్తుంది అన్నారు.

స్వతహాగా తనకు కామెడీ అంటే ఇష్టమని, ఈ సినిమాలో ఆద్యంతం నవ్వించే క్యారెక్టర్‌ను పోషించడం ఆనందంగా ఉందని కథానాయిక నందితా శ్వేత తెలిపింది. వెన్నెల కిషోర్, షకలక శంకర్ పండించిన కామెడీ హైలైట్‌గా నిలుస్తుందని నిర్మాత డా॥ అబినికా ఇనాబతుని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు. ఈ చిత్రం ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకురానుంది.
