Namaste NRI

నా అభిమానులు గర్వపడే సినిమా ఇది : కిరణ్‌ అబ్బవరం

కిరణ్‌ అబ్బవరం కథానాయకుడిగా రూపొందిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ కె-ర్యాంప్‌. యుక్తి తరేజా కథానాయిక. జైన్స్‌ నాని దర్శకుడు. రాజేశ్‌ దండా, శివ బొమ్మకు నిర్మాతలు.నేడు (18) ఈ సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో కిరణ్‌ అబ్బవరం మాట్లాడారు. ఫ్యామిలీ అందరితో కలిసి కూర్చుని నవ్వుకునే సినిమా కె-ర్యాంప్‌. మంచి సినిమా చేశామనే నమ్మకంతో ఉన్నాం. ఆ నమ్మకంతోనే థియేటర్లకు రండి అని ఆడియన్స్‌ని కాన్ఫిడెంట్‌గా పిలుస్తున్నాం. ఇది అసలైన దీపావళి సినిమా. అనుకున్నదానికంటే సినిమా బాగా వచ్చింది. నా అభిమానులు గర్వపడే సినిమా ఇది. ఇక నుంచి అలాంటి సినిమాలే చేస్తా. టికెట్‌ బుక్‌ చేయాలా వద్దా అనుకునేవారు కాన్ఫిడెంట్‌గా బుక్‌ చేసుకోండి. మీ డబ్బులు వృథా కావు. మిమ్మల్ని గ్యారెంటీగా నవ్విస్తాం అని అన్నారు.

ఈ సినిమా షూటింగ్‌ ఓ పిక్నిక్‌లా జరిగింది. సెట్‌లో నవ్వించిన ఏ సినిమా కూడా సక్సెస్‌ విషయంలో గురి తప్పదు. చేతన్‌ భరద్వాజ్‌ సంగీతం, సతీశ్‌ ఛాయాగ్రహణం సినిమాకు హైలైట్స్‌. దర్శకుడు జైన్స్‌ నాని 47రోజుల్లో షూటింగ్‌ పూర్తి చేశాడు. ఈ సినిమా కోసం కిరణ్‌ అబ్బవరం కంటిన్యూస్‌గా 48గంటలు పనిచేశాడు. కిరణ్‌ సినిమాలన్నీ ఒకెత్తు, ఈ సినిమా ఒకెత్తు. అందరికీ మంచి పేరు తెచ్చే సినిమా ఇది అని రాజేశ్‌ దండా పేర్కొన్నారు. తనకు అవకాశం ఇచ్చిన హాస్య మూవీస్‌కి దర్శకుడు జైన్స్‌ నాని కృతజ్ఞతలు తెలియజేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events