Namaste NRI

కుటుంబ సమేతంగా చూసి ఎంజాయ్‌ చేయాల్సిన సినిమా ఇది : నారా రోహిత్‌

నారా రోహిత్‌ కథానాయకుడిగా రూపొందిన చిత్రం సుందరకాండ. వెంకటేశ్‌ నిమ్మలపూడి దర్శకుడు. సంతోష్‌ చిన్నపొల్ల, గౌతమ్‌రెడ్డి, రాకేష్‌ మహంకాళి నిర్మాతలు. ఈ నెల 27న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నారా రోహిత్‌ మాట్లాడారు. ఈ సినిమా మంచి ఫ్యామిలీ ఎంటైర్టెనర్‌. కుటుంబ సమేతంగా చూసి ఎంజాయ్‌ చేయాల్సిన సినిమా ఇది. పేరుకు తగ్గట్టే అందరి హృదయాలనూ ఆనందంలో ముంచెత్తే సినిమా సుందరకాండ అని అన్నారు.

ఎంజాయ్‌ చేస్తూ చేసిన సినిమా ఇదని కథానాయిక శ్రీదేవి విజయ్‌కుమార్‌ చెప్పారు. ఒక రూల్‌ బ్రేక్‌ చేసి రొమాంటిక్‌ కామెడీ తీసినప్పుడు అది కచ్చితంగా సక్సెస్‌ అవుతుంది. ఇది అలాంటి సినిమానే  అని సీనియర్‌ నటుడు నరేష్‌ వి.కె పేర్కొన్నారు. ఇంకా దర్శకుడు వెంకటేశ్‌, నటి వాసుకి, నిర్మాత సంతోష్‌ కూడా మాట్లాడారు. వృతి వాఘాని మరో కథానాయికగా నటించిన ఈ చిత్రంలో సత్య, అజయ్‌, వీటీవీ గణేశ్‌, అభినవ్‌ గోమటం, విశ్వంత్‌, రూపలక్ష్మి, సునైనా, రఘుబాబు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: ప్రదీప్‌ ఎం.వర్మ, సంగీతం: లియోన్‌ జేమ్స్‌, నిర్మాణం: సందీప్‌ పిక్చర్స్‌ ప్యాలెస్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events