Namaste NRI

ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్‌ చేసే సినిమా ఇది:  అల్లు అరవింద్‌

అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పణలో రూపొందిన చిత్రం సింగిల్‌. శ్రీవిష్ణు, కేతిక శర్మ, ఇవానా జంటగా నటించిన ఈ చిత్రానికి కార్తీక్‌రాజు దర్శకుడు. విద్యా కొప్పినీడి, భానుప్రతాప్‌, రియాజ్‌ చౌదరి నిర్మాతలు.  సోమవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ముక్కోణపు ప్రేమకథా నేపథ్యంలో ట్రైలర్‌ ఆసాంతం నవ్వుల్ని పంచింది. ఈ సందర్భంగా అల్లు అరవింద్‌ మాట్లాడుతూ దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడు రెండు గంటల పాటు పగలబడి నవ్వుతూనే ఉన్నా. అంత అద్భుతంగా అనిపించింది. ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్స్‌లో హాయిగా ఎంజాయ్‌ చేసే సినిమా ఇది అన్నారు.

శ్రీవిష్ణు మాట్లాడుతూ ప్రేక్షకుల్ని ఇరగబడి నవ్వించాలనే లక్ష్యంతో ఈ సినిమా చేశామని, రెండున్నర గంటలు హ్యాపీగా ఎంజాయ్‌ చేస్తారని అన్నారు. ప్రేక్షకుల్ని పొట్టచెక్కలయ్యేలా నవ్వించే చిత్రమిదని, గీతా ఆర్ట్స్‌లో కామెడీ సినిమాలు ఎప్పుడూ ఫెయిల్‌ కాలేదని నిర్మాత బన్నీ వాసు పేర్కొన్నారు. ఈ చిత్రానికి విశాల్‌చంద్రశేఖర్‌ సంగీతాన్నందించారు.మే 9న విడుదలకానుంది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ సభ్యులందరూ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events