Namaste NRI

ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా కనెక్టయ్యే సినిమా ఇది

శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం విష్ణు విన్యాసం. నయనసారిక కథానాయిక. నిర్మాతలు జి.సుబ్రహ్మణ్యం నాయుడు, జి.సుమంత్‌నాయుడు, యదునాథ్‌ మారుతీరావు దర్శకుడు. ఈ సందర్భంగా నిర్మాతలిద్దరూ హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు.ఈ కథ విన్నప్పుడు ఎంత ఎంజాయ్‌ చేశామో, చూసుకున్నాక అంతకుమించి ఎంజాయ్‌ చేశాం. డైలాగ్స్‌ని శ్రీవిష్ణు స్పాట్‌లో ఇంప్రొవైజ్‌ చేస్తుంటారు. అవన్నీ ఇందులో ఆడియన్స్‌ని అలరిస్తాయి అని అన్నారు. ఇందులో హీరో పేరు విష్ణు. న్యూమరాలజీ అంటే తనకు అమితమైన నమ్మకం. ఈ పాత్ర చుట్టూనే కథ నడుస్తుంది. దానితోపాటు మరో ఆసక్తికరమైన ట్రాక్‌ కూడా ఉంటుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. అలాగే హీరోహీరోయిన్ల ఫ్యామిలీ ట్రాక్‌ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ కథలోనే కామెడీ వుంటుంది. అందుకే ఎక్కడా ఫోర్స్‌గా అనిపించదు. కథలో ప్రాధాన్యత ఉన్న పాత్రను నయనసారిక పోషించారు. ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా కనెక్టయ్యే సినిమా ఇది అని నిర్మాతలు సుబ్రహ్మణ్యం నాయుడు, సుమంత్‌ నాయుడు చెప్పారు.

శ్రీవిష్ణు కెరీర్‌లోని టాప్‌ 5 మూవీస్‌లో విష్ణు విన్యాసం ఒకటిగా నిలుస్తుందని, సంగీత దర్శకుడు రథన్‌ తన పాటలతో, నేపథ్య సంగీతంతో సినిమాకు అందాన్ని తెచ్చారని నిర్మాతలు తెలిపారు. ప్రస్తుతం రెండు సినిమాలు ప్రీప్రొడక్షన్‌ దశలో ఉన్నాయని, వాటి వివరాలు త్వరలో తెలియజేస్తామని వారన్నారు.ఈ నెల 27న సినిమా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events