శ్రీకాంత్, ప్రియాంక శర్మ జంటగా నటించిన చిత్రం తంతిరం. ముత్యాల మోహర్ దీపక్ దర్శకుడు. సినిమా బండి పతాకంపై శ్రీకాంత్ కంద్రగుల నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రమిది. భార్యభర్తల మధ్య ఆత్మ ప్రవేశిస్తే వారి దాంపత్య జీవితం ఎలా సాగిందన్నది ఆసక్తికరంగా ఉంటుంది. ఆద్యంతం ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకుంటుంది అన్నారు. శ్రీకాంత్ గుర్రం మాట్లాడుతూ సినిమా చలా తక్కువ రోజుల్లో చలా బాగా తీశాము ఈ సినిమా ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోతుంది.ఇది పక్క ప్రతి ఒక్కరు థియేటర్లో చూడండి ఈ సందర్భంగా పొడ్యుసర్ శ్రీకాంత్ కంద్రగుల మాట్లాడుతూ సినిమా కోసం ఎక్కడా బడ్జెట్ తగ్గకుండా చేశాము హీరో శ్రీకాంత్ పేరు అందరికి వినిపించే పేరు అవుతుంది.నేను చలా మూవీ ఓవర్సీస్ రిలీజ్ చేశాను.ఈ మూవీ పాన్ ఇండియా మూవీ అని అన్నారు. ఈ నెల 22న విడుదలకానుంది. ఈ చిత్రానికి కెమెరా: సిరుగుడి వంశీ శ్రీనివాస్, సంగీతం: అజయ్ అరసడ, దర్శకత్వం: ముత్యాల మోహర్ దీపక్.