Namaste NRI

అమ్మాయిలు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది: కాజల్‌ అగర్వాల్‌  

కాజల్‌ అగర్వాల్‌  ప్రధానపాత్ర పోషించిన చిత్రం సత్యభామ. హైదరాబాద్‌లో మ్యూజికల్‌ ఈవెంట్‌  ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా కాజల్‌ అగర్వాల్‌ మాట్లాడారు. సత్యభామ గా నటించడం ఛాలెంజింగ్‌గా అనిపిం చింది. ఇలాంటి కేరక్టర్‌ నా కెరీర్‌లో చేయడం తొలిసారి. ఈ సినిమాలో అన్ని ఎమోషన్సూ ఉన్నాయి. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని నమ్మకంగా చెప్పగలను అన్నారు. నేను బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత చేసిన సినిమా ఇది.

చాలా పర్పస్‌ఫుల్‌ సబ్జెక్ట్‌. అమ్మాయిలు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. షీ సేఫ్‌ యాప్‌ను అమ్మాయిలు ఎలా ఉపయోగించాలో ఈ సినిమాలో చూపించాం. సత్యభామ శక్తి కండబలంతోపాటు బుద్ధిబలంలో కూడా ఉంటుంది. మహిళాశక్తికి అద్దం పట్టే సినిమా ఇది అని తెలిపింది కాజల్‌. ఈ సందర్భంలోనే ఈ సినిమాలోని థర్డ్‌ సింగిల్‌ వెతుకు.. వెతుకు పాటను మేకర్స్‌ విడుదల చేశారు. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రానికి సుమన్‌ చిక్కాల దర్శకుడు కాగా, బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కళపల్లి నిర్మాతలు. శశికిరణ్‌ తిక్క సమర్పకులు. ఈ చిత్రానికి సంగీతం శ్రీచరణ్‌ పాకాల.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events