చాందిని చౌదరి, వశిష్టసింహా, భరత్‌రాజ్, ఆషు రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం యేవమ్. ప్రకాష్ దంతులూరి దర్శకుడు. నవదీప్, పవన్ గోపరాజు నిర్మాతలు. ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాస్ క దాస్ విశ్వక్‌సేన్, దర్శకుడు సందీప్‌రాజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

దర్శకుడు మాట్లాడుతూ ఇదో సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశమని, వినూత్నమైన కథనంతో ఆకట్టుకుంటుందని తెలిపారు. నవదీప్ మాట్లాడుతూ మంచి కంటెంట్‌తో నిజాయితీగా తీసిన సినిమా ఇది. యువతకు బాగా కనెక్ట్ అవుతుంది. చాందిని చౌదరి అభినయం ప్రధానాకర్షణగా నిలుస్తుంది అని పేర్కొన్నారు. ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఈ ఛాన్స్ వచ్చిందని, తన కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోతుందని కథానాయిక చాందిని చౌదరి చెప్పింది. ఈ నెల 14న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
