Namaste NRI

నా జీవితంలో మర్చిపోలేని సంక్రాంతి ఇది: మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం మన శంకర వరప్రసాద్ గారు. అనిల్ రావిపూడి దర్శకత్వం. సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలై, ప్రేక్షకుల నుంచి అపూర్వమైన ఆదరణ పొందింది. ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి, ప్రాంతీయ సినిమాల్లో ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఈ ఘన విజయాన్ని పురస్కరించుకుని చిత్రబృందం ఘనంగా సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చి నా గత వైభవాన్ని మళ్లీ పునరావృతం చేసిన తెలుగు ప్రేక్షకులకు నా శిరస్సు వంచి ధన్యవాదాలు. ఈరోజు చూస్తుంటే ఎప్పుడో రెండు మూడు దశాబ్దాల క్రితం ఉన్న ఫీలింగ్ గుర్తొస్తోంది. అప్పట్లో ఎగ్జిబిటర్లు, బయర్లు, డిస్ట్రిబ్యూటర్లకు స్టేజ్ మీద షీల్డ్స్ ఇచ్చేవాళ్లం. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ అలాంటి వింటేజ్ ఫంక్షన్ వాతావరణాన్ని తీసుకొచ్చారు. వింటేజ్ చిరంజీవినే కాదు, వింటేజ్ సెలబ్రేషన్స్‌ని కూడా తీసుకొచ్చిన ఘనత అనిల్ రావిపూడికే చెందుతుంది. థాంక్యూ సో మచ్ అనిల్ అని ప్రశంసల వర్షం కురిపించారు.ఆర్టిస్ట్స్‌తో అనిల్ ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్లను ఎప్పుడూ గుడ్ హ్యూమర్‌లో ఉంచడం చూస్తుంటే నాకు 100 శాతం కె. రాఘవేంద్ర రావు గారే గుర్తొస్తారు అని అన్నారు.

ఇంట్లో తన పరిస్థితి గురించి సరదాగా, భావోద్వేగంగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలు కూడా ప్రేక్షకులను నవ్వించాయి, కదిలించాయి. మీరు షూటింగ్‌కి వెళ్తే చాలా హుషారుగా ఉంటారు, ఇంట్లో ఉంటే ఏదోలా ఉంటారు… షూటింగ్ త్వరగా పెట్టమని అనిల్‌కి చెప్పండి అని నా భార్య సురేఖ అంటుండేది. షూటింగ్ అయిపోయిన చివరి రోజు, పిల్లలు చదువు పూర్తయ్యాక వేర్వేరు ప్రదేశాలకు వెళ్లినప్పుడు వచ్చే బాధను నేను అనుభవించాను” అంటూ తన అనుభూతిని పంచుకున్నారు. ఈ సంక్రాంతికి వచ్చిన దాదాపు అన్ని సినిమాల్నీ జనం ఆదరించారు. ఒకటి రెండు అటూ ఇటుగా ఉన్నా, మొత్తంగా ఈ సంక్రాంతి నాకు జీవితంలో మర్చిపోలేని సంక్రాంతి అని పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events