రాష్ట్రీయ స్వయం సేవక్(ఆర్ఎస్ఎస్)పై అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ తనదైన రీతిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కొన్ని మతాలు, భాషలు, వర్గ ప్రజలను, ఆర్ఎస్ఎస్ చాలా హీనంగా చూస్తున్నట్లు ఆయన ఆరోపించారు. భారత్‌లో జరుగుతున్న పోరాటం ఇదే అని, రాజకీయ పోరాటం కాదు అని ఆయన తెలిపారు. వాషింగ్టన్ డీసీ శివారులో ఉన్న హెర్న్‌డాన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన భారతీయుల్ని ఉద్దేశించి మాట్లాడారు. అసలు భారత్‌లో దేని గురించి పోరాటం జరుగుతుందన్న విషయాన్ని అర్థం చేసుకోవాలని, ఇది రాజకీయాల కోసం జరుగుతున్న ఫైట్ కాదు అని, ఇది అంతకన్నా విలువైందన్నారు.
మీటింగ్‌కు వచ్చిన ఓ సిక్కు యువకుడిని ఉద్దేశించి రాహుల్ మాట్లాడుతూ మీ పేరేంటి సోదరా, తలపాగాతో ఉన్న మీరు మీ గురించి చెప్పమన్నారు. ఓ సిక్కు మతస్థుడు భారత్‌లో తలపాగాను పెట్టుకునే అవకాశాన్ని కల్పిస్తారా లేదో తెలియడం లేదని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. సిక్కులను గురుద్వారాకు వెళ్లినిస్తారో లేదన్నారు. దీని కోసమే దేశంలో పోరాటం జరుగుతోందన్నారు. వాషింగ్టన్ డీసీ కన్నా ముందు డల్లాస్‌లోనూ రాహుల్ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్‌పై విమర్శలు చేశారు. కొన్ని రాష్ట్రాలు కొన్ని రాష్ట్రాల కన్నా తక్కువ అన్న అభిప్రాయాన్ని ఆర్ఎస్ఎస్ వ్యక్తం చేస్తోందన్నారు. కొన్ని భాషల కన్నా, కొన్ని భాషలు తక్కువే అన్న ఆలోచనవారిదన్నారు. కొన్ని మతాల కన్నా మరికొన్ని మతాలు తక్కువ అన్న అభిప్రాయాలను ఆర్ఎస్ఎస్ వినిపిస్తోందని రాహుల్ తెలిపారు.