Namaste NRI

ఇది ఇక్కడితో ఆగే సినిమా కాదు.. ఇంకా ఎన్నో అవార్డులు : శివాజీ

శివాజీ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం దండోరా. రూరల్‌ తెలంగాణ నేపథ్యంలో కుల వివక్షల కథాంశంగా తెరకెక్కిన ఈ చిత్రానికి మురళీకాంత్‌ దర్శకుడు. రవీంద్ర బెనర్జీ నిర్మించిన ఈ చిత్రం రాష్ట్రప్రభుత్వ తాజాగా ప్రకటించిన గద్దర్‌ అవార్డులు 2025లో సత్తా చాటింది. మూడు కేటగిరీల్లో అవార్డులను కొల్లగొట్టింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన థాంక్స్‌మీట్‌లో శివాజీ మాట్లాడారు. మా దండోరా సినిమాను గుర్తించి అవార్డులిచ్చిన జ్యూరీకి, తెలంగాణ ప్రభుత్వానికీ ధన్యవాదాలు. ఈ సినిమాకోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఈ అవార్డుల్లో భాగం ఉంది. దర్శకుడు మురళీకాంత్‌ ఈ సినిమాను మా కోసమే తీశాడనిపిస్తుంది. ఈ పాత్ర కోసం, లుక్‌ కోసం చాలావరకూ రాత్రిపూట రెండుమూడు గంటలే నిద్రపోయేవాడ్ని. రాధ్య అనే పాప పాత్ర లేకపోయి ఉంటే ఈ సినిమా చేసేవాడ్ని కాదు. ఇది ఇక్కడితో ఆగే సినిమా కాదు. ఇంకా ఎన్నో అవార్డులను ఈ సినిమా అందుకోనుంది అని అన్నారు.

తాను కొత్తవాడ్నయినా ఈ టీమ్‌ తననెంతో నమ్మిందని, శివాజీ వల్లే ఈ సినిమా ఈ స్థాయికి వచ్చిందని, ఈ గుర్తింపు మరిన్ని మంచి సినిమాలు తీయాలనే ఉత్సాహాన్నిచ్చిందని దర్శకుడు మురళీకాంత్‌ అన్నారు. ఇంకా నిర్మాత రవీంద్ర బెనర్జీ, సంగీత దర్శకుడు మార్క్‌ కె.రాబిన్‌, నటుడు నందు, నటి మనికారెడ్డి, కాస్ట్యూమ్‌ డిజైనర్‌ రేఖ కూడా మాట్లాడారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events