Namaste NRI

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్ పోర్ట్ కలిగిన దేశం ఇదే

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్ పోర్ట్ కలిగిన దేశంగా సింగపూర్ నిలిచింది. గత ఐదేళ్లుగా అగ్రస్థానంలో ఉన్న జపాన్ ను తాజాగా సింగపూర్ వెనక్కి నెట్టి అత్యంత శక్తివంతమైన పాస్ పోర్ట్ కలిగిన దేశంగా అవతరించింది. సింగపూర్ పాస్ పోర్ట్ ఉన్న వారు వీసా రహితంగా, వీసా ఆన్ అరైవల్ విధానంలో ప్రపంచవ్యాప్తంగా 192 దేశాల్లో పర్యటించవచ్చు. అన్ని దేశాల పాస్ పోర్ట్ ల ర్యాంకింగ్స్ కు సంబంధించిన నివేదికను లండన్ కు చెందిన ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్ తాజాగా విడుదల చేసింది. గత ఐదేళ్లుగా అగ్రస్థానంలో ఉన్న జపాన్ ప్రస్తుతం మూడో స్థానానికి పడిపోయింది. ఈ పాస్ పోర్ట్ ద్వారా గతంలో 193 దేశాల్లో పర్యటించే అవకాశం ఉండేది. కానీ, ప్రస్తుతం 189 దేశాల్లో మాత్రమే పర్యటించొచ్చు.

ఈ జాబితాలో జర్మనీ, ఇటలీ, స్పెయిన్ రెండో స్థానంలో నిలిచాయి. ఈ దేశాల పాస్ పోర్ట్ ల ద్వారా 190 దేశాల్లో తిరిగే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, స్వీడన్, లక్సెంబర్గ్ దేశాలు మూడో స్థానంలో నిలిచాయి. ఈ దేశాల పాస్ పోర్ట్ లు కలిగిన వారు 189 దేశాల్లో తిరగొచ్చు. డెన్మార్క్, ఐర్లాండ్, నెదర్లాండ్, యూకే నాలుగో స్థానంలో ఉన్నాయి. ఈ దేశాల పాస్ పోర్ట్ లు కలిగిన వారు స్వేచ్ఛగా 188 దేశాలను చుట్టేయొచ్చు. గతంలో 85వ స్థానంలో నిలిచిన భారత్,  ప్రస్తుతం 57 దేశాలకు వీసా రహిత ప్రవేశంతో టోగో, సెనెగల్ తో పాటు సూచీలో 80వ స్థానానికి చేరుకుంది. ఈ దేశాల పాస్ పోర్ట్ తో 57 దేశాల్లో పర్యటించొచ్చు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events