అత్యంత ఉష్ణోగ్రత కలిగిన రోజుగా ఈ నెల 22 రికార్డు సృష్టించింది. ఆ రోజున ప్రపంచ సరాసరి సగటు ఉష్ణోగ్రత 17.15 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఈ నెల 21న రికార్డు సృష్టిస్తూ నమోదైన 17.09 డిగ్రీలను ఇది మించిపోయింది. 1940 నుంచి ఇప్పటి వరకూ ఈ నెల 22న నమోదైన సగటు ఉష్ణోగ్రతే అత్యధికమని వివరించింది. ఇప్పటి వరకు 2023, జులై 6 నాటి 17.08 డిగ్రీలు, 2024 జులై 21 నాటి 17.09 ఉష్ణోగ్రతలే గరిష్ఠంగా ఉన్నాయి. కొత్త రికార్డులు సృష్టిస్తూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న క్రమంలో తాజా తాపస్థాయి రికార్డు లు బద్దలుకొట్టింది. అంతర్జాతీయంగా సాధారణం కంటే 1.5 డిగ్రీలు లేదా అంతకుమించి ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం 12 నెలలుగా వరసగా కొనసాగుతూ వస్తోంది. గత జూన్ నుంచి ప్రతి నెలా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.