పాపులర్ బ్యూటీ హన్సికా మోత్వానీ టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం మై నేమ్ ఈజ్ శృతి. శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వం. ఇప్పటికే విడుదలైన టీజర్,ట్రైలర్‌కు చక్కని స్పందన వస్తోంది. లేడి ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టును వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై బురుగు రమ్య ప్రభాకర్ నిర్మిస్తున్నారు. మై నేమ్ ఈజ్ శృతి నవంబర్ 17న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మీడియాతో చిట్ చాట్ చేసింది హన్సికా మోత్వానీ. స్కిన్ మాఫియా ముప్పును స్పృశించే డార్క్ థ్రిల్లర్ చిత్రమిది. ఈ నేపథ్యంలో సినిమా చేయడం ఇదే తొలిసారి. నా పాత్ర ఇందులో ఓ ట్రాప్‌లో పడుతుంది. శృతి యాడ్ ఏజెన్సీలో పనిచేస్తోంది. ఆమె పాత్ర ఒక పోరాట యోధురాలులాగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం ఎక్కువ. దేనికీ వెనకడుగు వేయదు. ఎలాంటి అడ్డంకు లు వచ్చినా వాటిని దాటుకుంటూ వెళ్తుంది. అలాంటి శృతికి ఓ భయంకరమైన, అధిగమించలేదని సమస్య ఎదురవుతుంది? దాని నుండి శృతి ఎలా బయటపడింది అనేదే ఈ చిత్ర కాన్సెప్ట్. వ్యక్తిగతంగా నాకు ఇలాంటి చిత్రాలంటే ఇష్టం.
మా అమ్మ డెర్మటాలజిస్ట్. ఈ సినిమా చేసే క్రమంలో నిజంగా స్కిన్ మాఫియా ఉందా? అని అమ్మను అడిగాను . తను కూడా ఎక్కడో ఇలాంటి ఘటన జరిగినట్లు చదివానని చెప్పింది. ఈ మాఫియా ద్వారా సామాన్యుడి జీవితంలో చీకటి వ్యాపిస్తుంది. ఈ సినిమా కోసం దర్శకుడు శ్రీనివాస్ ఓంకార్ పరిశోధన చేస్తున్న సమయంలో కొన్ని అనుకోని సంఘటనలను ఫేస్ చేశారు. ఇటువంటి సున్నితమైన అంశాన్ని టచ్ చేస్తూ, సినిమా చేయడం సవాలుతో కూడుకున్న అంశం. ఊహించని ట్విస్ట్‌లతో. చూస్తున్న ప్రతి ఒక్కరికీ థ్రిల్ ఇస్తుందీ సినిమా. ఇలాంటి థ్రిల్లర్ స్పేస్‌లో భాగమైనందుకు చాలా హ్యాపీగా అనిపించింది. ఫైనల్ అవుట్‌పుట్‌తో చూసి చాలా హ్యాపీ. సాంకేతికంగానూ ఈ సినిమా అందరికీ నచ్చుతుందన్నారు. ఖచ్చితంగా ఈ సినిమా మీకు నచ్చడమే కాదు, ఆలోచింపజేస్తుందని మాత్రం కాన్ఫిడెంట్‌గా చెప్పగలను అని తెలిపారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)