హమాస్ మిలిటెంట్‌లతో యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి ఇజ్రాయెల్ సైన్యానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హమాస్ మిలిటెంట్లు ఆర్‌పీజీ లాంచర్‌ను ప్రయోగించడంతో 21 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందారు. మరో దాడిలో మరో ముగ్గురు సైనికులు మరణించారు. మొత్తం 24 మంది ఇజ్రాయెల్ సైనికులు ఈ దాడిలో మృతిచెందారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. హమాస్‌తో యుద్ధం మొదలైన తర్వాత ఇంత భారీ సంఖ్యలో ఇజ్రాయెల్ సైనికులు ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి.
