Namaste NRI

నా కెరీర్ ని మలుపు తిప్పే సినిమా ఇదే

విశ్వక్‌సేన్‌ కథానాయకుడు రూపొందుతోన్న చిత్రం గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి. కృష్ణచైతన్య దర్శకుడు. సూర్య దేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. హైదరాబాద్లో ఈ చిత్రం టీజర్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విశ్వక్‌సేన్‌ మాట్లాడారు. టీజర్‌లో చూసింది ఒక్క శాతమే. ఈ సినిమా మీ అంచనాలను మించేలా ఉంటుంది. ఇది నేను చాలా కష్టపడి చేసిన సినిమా. ఒక్కటి మాత్రం నిజాయతీగా చెప్పగలను. ఈ సినిమా తర్వాత గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరికి ముందు గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరికి తర్వాత అనేలా నా కెరీర్‌ ఉంటుంది  అని  అన్నారు.  

మంచి సినిమా తీశామని దర్శకుడు నమ్మకం వ్యక్తం చేశారు. విశ్వక్‌ నటించిన పక్కా మాస్‌ మసాలా సినిమా ఇదని, మే 17న సినిమా విడుదల చేయనున్నామని నిర్మాత సూర్యదేవర నాగవంశీ చెప్పారు. ఈ సినిమా తర్వాత తనను అందరూ బుజ్జీ అని పిలుస్తారని నేహాశెట్టి తెలిపారు. ఇందులో రత్నమాల అనే అద్భుతమైన పాత్రను పోషించానని, ఈ టీమ్‌తో పనిచేయడం ఆనందంగా ఉందని అంజలి అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events