Namaste NRI

వరంగల్‌ అమ్మాయి.. హైదరాబాద్‌ అబ్బాయి మధ్య జరిగే కథ ఇది

విక్రమ్‌, చాందినీ చౌదరి  నటిస్తున్న చిత్రం సంతాన ప్రాప్తిరస్తు.  సంజీవ్‌రెడ్డి దర్శకుడు. మధుర శ్రీధర్‌రెడ్డి, నిర్వి హరిప్రసాద్‌రెడ్డి నిర్మాతలు. ఈ చిత్రం షూటింగ్‌  లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశా నికి నిర్మాత అంబికాకృష్ణ కెమెరా స్విచాన్‌ చేయగా, వసుధ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ మంతెన వెంకటరామరాజు క్లాప్‌ ఇచ్చారు. మధుర శ్రీధర్‌రెడ్డి తొలిషాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు. స్క్రిప్ట్‌ను నిర్మాతలిద్దరూ కలిసి దర్శకుడు సంజీవ్‌రెడ్డికి అందించారు. వరంగల్‌ అమ్మాయి, హైదరాబాద్‌ అబ్బాయి మధ్య జరిగే మ్యూజికల్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. కుటుంబప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సినిమా అవుతుంది. ఎంటర్‌టైన్‌మెంట్‌గా సాగే ఈ కథలో ఓ కాంటెంపరరీ ఇష్యూ కూడా ఉంటుంది.

పెళ్లయిన కొత్తలో భార్యాభర్తలు ఎదుర్కొనే ఓ సమస్యను వినోదాత్మకంగా చూపించనున్నాం అని దర్శకుడు చెప్పారు. వచ్చే నెల 8 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తామని నిర్మాతలు తెలిపారు. వెన్నెలకిశోర్‌, అభినవ్‌ గోమటం, మురళీధర్‌గౌడ్‌, జీవన్‌కుమార్‌, తాగుబోతు రమేశ్‌, రచ్చరవి తదితరులు  ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: మహిరెడ్డి పండుగుల, మాటలు: కల్యాణ్‌ రాఘవ్‌, సంగీతం: సునీల్‌కశ్యప్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events