సాయి చరణ్, పల్లవి, ట్రాన్సీ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఐక్యూ (పవర్ ఆఫ్ స్టూడెంట్స్). ఈ చిత్రాన్ని కాయగూరల రాజేశ్వరి సమర్పణలో కేఎల్పీ మూవీస్ పతాకంపై కాయగూరల లక్ష్మీ పతి నిర్మించారు. జీఎల్బీ శ్రీనివాస్ దర్శకుడు. జూన్ 2న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా నిర్మాత కాయగూరల లక్ష్మీపతి మాట్లాడుతూ తెలివైన అమ్మాయిని కాపాడే అబ్బాయి కథ ఇది. యువతకు నచ్చే అంశాలుంటాయి. సైన్స్ నేపథ్యంగా కమర్షియల్ మూవీగా నిర్మించాం అన్నారు. దర్శకుడు జీఎల్బీ శ్రీనివాస్ మాట్లాడుతూ ఓ యువ జంట మధ్య జరిగే కథను ఆసక్తికరంగా చూపిస్తున్నాం. కథ కథనాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతాయి అన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/05/9f49e8d2-8280-46f1-9cd4-82d86a88c854-49-117.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/05/638bff07-efd2-4cc9-8546-98039833db3c-123.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/05/45af6911-9449-466d-a7e1-ba146800284b-116.jpg)