తైవాన్ రాజధాని తైపీలోని 101 అంతస్థుల భవనం ఆధునిక ఇంజినీరింగ్ నిర్మాణ శక్తికి నిదర్శనంగా నిలిచిం ది. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన భవనాల్లో ఒకటైన ఈ భవనం తైవాన్ భూకంప తాకిడిని తట్టుకొని నిలబ డటం ఇప్పుడు వార్తల్లో నిలిచింది. రెండు రోజుల క్రితం తైవాన్‌లో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేల్ పై 7.4 నమోదైంది. దీని తీవ్రతకు పలు నగరాల్లోని భారీ భవనాల పునాదులు కదలిపోయాయి. అయితే తైపీ 101 అంతస్థుల భవనానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. వినూత్నమైన ఇంజినీరింగ్ నిర్మాణ శైలి ఈ భవనా న్ని భూకంపం నుంచి బయటపడేసిందని నిపుణులు చెబుతున్నారు. ట్యూన్డ్ మాస్ డంపర్‌గా పిలువబడే ఒక భారీ ఉక్కు గోళాన్ని 87-92 అంతస్తుల మధ్య ఏర్పాటుచేశారు. భూకంపం నుంచి వెలువడే ప్రకంపల ప్రభావాన్ని నిర్వీర్యం చేయటంలో ఈ ఉక్కుగోళం సక్సెస్ అయ్యింది.