రష్యాతో భారత్ చమురు బంధమే, న్యూఢిల్లీతో చర్చల్లో తమకు చికాకు తెప్పించే అంశమని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో అన్నారు. భారత్ కొంటున్న చమురుతోనే పుతిన్, ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని కొనసాగిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇదే మతను ఇబ్బందిపెట్టే అంశమని స్పష్టం చేశారు.

రూబియో మాట్లాడుతూ రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లే ఉక్రెయిన్‌లో మాస్కో యుద్ధ ప్రయత్నాలను నిలబెట్టడానికి సాయపడుతోంది. భారత్‌కు భారీగా ఇంధన అవసరాలున్నాయి. అన్ని దేశాల్లాగే ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకునేందుకు చమురు, బొగ్గు, గ్యాస్ కొనగలిగే శక్తి భారత్‌కు ఉంది. అయితే, రష్యాపై పలు దేశాల ఆంక్షల వల్ల అక్కడ భారత్‌కు చమురు చౌకగా లభిస్తోంది. దీంతో న్యూఢిల్లీ తమ అవసరాల దృష్ట్యా రష్యా నుంచి చమురును తక్కువ ధరకు కొనుగోలు చేస్తోంది. దురదృష్టవశాత్తూ భారత్ చమురు కొనుగోలు వల్లే రష్యాకు నిధులు సమకూరుతున్నాయి. వాటిని మాస్కో, ఉక్రెయిన్‌లో యుద్ధం కోసం వాడుకుంటోంది. ఇదే భారత్‌తో చర్చల్లో అమెరికాకు చికాకు తెప్పించే అంశం. ప్రపంచ వాణిజ్యంలో భారత్ వాటాదారు. వ్యూహాత్మక భాగస్వామి. అన్ని అంశాల్లో మాదిరిగా విదేశాంగ విధానంలోని ప్రతి విషయంలోనూ 100 శాతం సమయాన్ని కేటాయించడం సాధ్యంకాదు ఇబ్బందిపెట్టే అంశం అన్నారు.
















