ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న పాకిస్తాన్‌కు భారత్ తీసుకున్న చర్యలతో మరోసారి ఆర్థికంగా తీవ్రంగానే నష్టపోతున్నది. అప్పుల ఊభిలో కూరుకుపోయిన పాకిస్తాన్, చేసిన తప్పులకు ప్రస్తుతం శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఎదురవుతున్నది. భారత విమానాలకు గగనతలాన్ని నిషేధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ రెండునెలల్లోనే ఏకంగా రూ.1240 కోట్ల నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి ఎదురైంది. ఎయిర్ స్పేస్‌ను మూసివేయడం వల్ల ఫలితంగా ట్రాఫిక్ 20శాతం తగ్గిందని రక్షణ మంత్రిత్వశాఖ పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీకి తెలిపింది. ఏప్రిల్ 22న పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్‌పై భారత్ కఠిన చర్యలు తీసుకుంది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయగా, పాకిస్తాన్ భారతీయ విమానాలకు ఎయిర్ స్పేస్‌ను మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఈ నిషేధం కారణంగా ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న పాకిస్తాన్‌కు తీవ్రంగా నష్టం వాటిల్లుతున్నది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్తాన్ తాను చేసిన చిన్న తప్పు కారణంగా భారీ నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి ఎదురైంది. రెండునెల్లలోనే రూ.1240 కోట్లు నష్టపోగా, ఎయిర్‌స్పేస్ బ్యాన్ కారణంగా 20శాతం ట్రాఫిక్ తగ్గిందని రక్షణ మంత్రిత్వశాఖ పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీకి తెలిపింది.
















