విదేశాల్లో ఓ భారతీయ విద్యార్థి చూపించిన దేశభక్తిని అందరూ మెచ్చుకుంటున్నారు. దేశభక్తి అంటే ఇది కదా అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..ఇది ఏ దేశంలోనో తెలియదుగానీ విద్యార్థులకు డిగ్రీ పట్టాల ప్రదానోత్సవం జరుగుతోంది. ప్రొఫెసర్స్, కళాశాల యాజమాన్యం ఒక్కో స్టూడెంట్‌ను వేదికపైకి ఆహ్వానించి వారి చేతికి డిగ్రీ పట్టాను అందిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడే చదువుకున్న భారతీయ విద్యార్థి వంతు వచ్చింది. మనోడు అందరిలా కాకుండా ఓ ప్రత్యేక వేషధారణలో స్టేజీపైకి ఎక్కాడు. అందరూ ప్యాంటు, షర్టు వేసుకుని వస్తే మనోడు మాత్రం సంప్రదాయబద్ధంగా కుర్తా, పైజామా ధరించాడు. వస్తూ వస్తూనే అక్కడున్న పెద్దల అనుమతి తీసుకుని డిగ్రీ పట్టా అందుకోవడానికి ముందే తనతో పాటు తీసుకెళ్లిన మన జాతీయ పతాకాన్ని జేబులోంచి తీసి ప్రదర్శించాడు. మువ్వన్నెల జెండా పట్టుకుని వేదిక చుట్టూ తిరిగాడు. అలా మనోడు జాతీయ జెండాను పట్టుకొని తిరిగిన ఆ దృశ్యాన్ని చూస్తే గూస్‌బమ్స్ రావడం ఖాయం. అది చూసి అక్కడున్న వారంతా చప్పట్లు కొట్టారు. దీని తాలూకు వీడియోను మిని త్రిపాఠి అనే వ్యక్తి ట్విటర్ లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.