Namaste NRI

ఈ మూన్‌ జాకెట్‌ చాలా కాస్ట్‌ లీ…ధర తెలిస్తే దిమ్మతిరుగుతుంది 

అమెరికన్‌ ఆస్ట్రోనాట్‌ బజ్‌ ఆల్డ్రిన్‌ వేసుకున్న స్పేస్‌ జాకెట్‌ను వేలంలో భారీ ధర పలికింది. చంద్రుడిపైకి వెళ్లినప్పుడు ఆయన వేసుకున్న స్పేస్‌ జాకెట్‌ను ఇటీవల న్యూయార్క్‌లో వేలానికి పెట్టారు. న్యూయార్క్‌లో జరిగిన వేలంలో ఆ మూన్‌ జాకెట్‌ 28 లక్షల డాలర్లకు అమ్ముడుపోయింది. అపోలో 11 కమాండ్‌ మాడ్యూల్‌ కొలంబియా స్పేస్‌ క్రాఫ్ట్‌ ఆల్డ్రిన్‌ చంద్రుడిపైకి వెళ్లారు. 1969లో అమెరికా వ్యోమగామి మూన్‌ మీదకు వెళ్లారు.  అమెరికా జాతీయ జెండాతో పాటు నాసా లోగో ఆల్డ్రిన్‌ జాకెట్‌పై ఉంది. 92 ఏళ్ల బజ్‌ ఆల్డ్రిన్‌ ఇంకా బ్రతికే ఉన్నారు. స్పేస్‌ ట్రిప్‌కు సంబందించిన 69 వ్యక్తిగత వస్తువుల్ని అతను వేలానికి ఉంచారు. సూత్బే కంపెనీ మూన్‌ జాకెట్‌ను వేలం వేసింది. ఆరు రోజుల పాటు సాగిన స్పేస్‌ జర్నీలో ఇదే జాకెట్‌ను ఆల్డ్రిన్‌ ధరించారు. నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌తో కలిపి బజ్‌ ఆల్డ్రిన్‌ 21 గంటల పాటు చంద్రుడిపై గడిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events