Namaste NRI

ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్‌ : ప్రియదర్శి

ప్రియదర్శి హీరోగా నటించిన తాజా చిత్రం డార్లింగ్‌ ప్రేక్షకుల ముందుకొచ్చింది. నభానటేష్‌ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి అశ్విన్‌రామ్‌ దర్శకుడు. నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించారు. సక్సెస్‌మీట్‌లో ప్రియదర్శి మాట్లాడుతూ థియేటర్లో ప్రేక్షకుల మధ్య కూర్చొని సినిమా చూశాను. కామెడీ, ఎమోషన్స్‌కు వారు బాగా కనెక్ట్‌ అవుతున్నారు. సినిమా చూస్తూ మా అమ్మగారు క్లాప్స్‌ కొట్టడం చాలా ఆనందంగా అనిపించింది అన్నారు. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్‌ అవుతున్నది. అన్ని కేంద్రాల్లో అద్భుతమైన స్పంద న లభిస్తున్నది. అందరూ థియేటర్లలో సినిమాను ఎంజాయ్‌ చేయండి అన్నారు.

తాము ఊహించినట్లుగానే మహిళా ప్రేక్షకులు సినిమాను బాగా ఇష్టపడుతున్నారని, రాబోవు రోజుల్లో ఫ్యామిలీ ఆడియెన్స్‌ అందరూ సినిమాను ఆదరిస్తారనే నమ్మకం ఉందని దర్శకుడు అశ్విన్‌ రామ్‌ పేర్కొన్నారు. నభా నటేష్‌ మట్లాడుతూ ఇదొక క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. ద్వితీయార్థంలోని కొన్ని సన్నివేశాలకు ప్రేక్షకులు ఎమోషనల్‌గా ఫీలవుతున్నారు. ఈ సినిమా మా అంచనాలను అందుకుంది అని చెప్పింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ సభ్యులందరూ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events