Namaste NRI

ఈ సినిమా మదర్ సెంటిమెంట్‌తో పాటు అన్ని :  సురేష్ కొండేటి

అధ‌ర్వ్, నిమిషా సాజయాన్ హీరో, హీరోయిన్‌లుగా నటించిన ఈ చిత్రం మై బేబి.  జూలై 18న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఎస్ కే పిక్చర్స్, యష్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్‌లపై సంయుక్తంగా ఈ చిత్రాన్ని సురేష్ కొండేటి నిర్మిస్తున్నారు. దుప్పాడిగట్టు సారిక రెడ్డి, పి. సాయిచరణ్ తేజ సహ-నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా మై బేబి చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా  తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ట్రైలర్ చూస్తే ఇది బలమైన కథాంశం ఉన్న చిత్రమని తెలుస్తోంది. ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొంది, సురేష్‌కు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

ఈ సినిమా మంచి మదర్ సెంటిమెంట్‌తో పాటు అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌ను కలిగి ఉంది. ఐదు అద్భుతమైన ఫైట్స్ ఉన్నాయి. మై బేబి ట్రైలర్ లాంచ్‌కు విచ్చేసిన భరద్వాజ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఆయన ఎంత బిజీగా ఉన్నా మా కోసం వచ్చారు. మై బేబి సినిమాను థియేటర్లలో చూసి ఆదరించాలని కోరుతున్నాను అని సురేష్ కొండేటి పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News