సూర్య అయ్యలసోమయాజులు హీరోగా నటిస్తున్న చిత్రం రామ్ (ర్యాపిక్ యాక్షన్ మిషన్). ధన్య బాలకృష్ణ కథానాయిక. మిహిరామ్ వైనతేయ దర్శకుడు. దీపికాంజలి వడ్లమాని నిర్మాత. ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. దర్శకుడు మట్లాడుతూ తీవ్రవాదుల దాడుల నుంచి మనల్ని కాపాడే హీరోల సాహసాలను ఈ సినిమాలో చూపించాను. దేశభక్తి ప్రధానంగా ఆకట్టుకుంటుంది అన్నారు. నిర్మాత దీపకాంజలి మాట్లాడుతూ మాకు ఇది తొలి చిత్రమని, దర్శకుడు కథ చెప్పినట్టు చిత్రాన్ని మలిచారన్నారు. సూర్య చక్కగా నటించారని, ఈ సినిమాకు సంబంధించి ప్రతి టిక్కెట్ నుంచి రూ.5 నేషనల్ డిఫెన్స్ ఫండ్‌కు అందిస్తామని తెలిపారు. మన దేశ సైనికులకు ఈ సినిమా అంకితం చేస్తున్నామని తెలిపారు. ఎందరో సీనియర్ నటులు ఈ సినిమాలో భాగమయ్యారని, కొన్ని సన్నివేశాలు కన్నీళ్లు పెట్టిస్తాయని తెలిపారు. చాలా రోజుల తర్వాత దేశభక్తి ప్రధానమైన సినిమాలో నటించానని సీనియర్ నటుడు సాయికుమార్ తెలిపారు. ఈ నెల 26న విడుదలకానుంది.